[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]గో[/qodef_dropcaps] వా బ్యూటీ లాక్ ఇలియానా.. తెలుగు చిత్ర పరిశ్రమకు దేవదాసు సినిమాతో పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. పోకిరి హిట్ అవ్వడంతో తెలుగులో తన సినిమాలతో ఓ ఊపు ఊపేసింది. మరియు కోటి పారితోషకం అందుకున్న తారగా గుర్తింపు పొందింది. అదే సమయంలో ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది.
బాలీవుడ్లో ఈ బ్యూటీ ఫస్ట్ మూవీ బర్ఫీ. ఈ చిత్రంలో రణభీర్‌కపూర్ హీరోగా నటించాడు.
అయితే ఇటీవల వెండితెరపై తన తొలిముద్దు అనుభవం గురించి ఇలియానా మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. సినిమాల్లో తన మొదటి ముద్దు సన్నివేశాల గురించి చెప్తూ.. బర్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌ని ముద్దు పెట్టుకోవడం ఓ పీడకల అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సీన్లో తాను చాలా అసౌకర్యంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ రోజు రణబీర్ కపూర్‌తో లిప్ లాక్ సీన్లో నరకం చూసానని చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటి. కాగా, అనురాగ్ బసు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ఇలియానా రణ్ బీర్ కపూర్‌తో లిఫ్ లాక్ సీన్ తీశారు. అయితే ఆ సీన్ సినిమాకే మరింత మసాలను అందిస్తుంది.