గేమ్ చేంజర్ ఔట్ పుట్ తో శంకర్ అసంతృప్తి!
రామ్ చరణ్ సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పొలిటికల్ యాక్షన్ మూవీ ప్రస్తుతం ధియేటర్లలో రన్ అవుతోంది. అయితే.. ‘సినిమా తాను అనుకున్న విధంగా రాలేద’ని దర్శకుడు శంకర్ ఓ ఇంటర్వ్యూలో సినిమాపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ‘గేమ్ చేంజర్ ఔట్ పుట్ తో నేను హ్యాపీగా లేను. సినిమా ఇంకా బాగా రావాల్సింది.
గేమ్ చేంజర్ అసలు రన్ టైం 5 గంటలు!
నేను అనుకున్న ప్రకారం సినిమా 5గంటల రన్ టైమ్ ఉండాలి. కానీ, సమయాభావం వల్ల మంచి సీన్లు ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా చూపించలేకపోయా. కానీ..రామ్ చరణ్, సూర్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు’. ‘సినిమాకు మంచి స్పందన వస్తుందని విన్నాను. ఆన్ లైన్ రివ్యూలు చూడలేద’ని అన్నారు. శంకర్ వ్యాఖ్యలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు 3ఏళ్లు సమయం తీసుకున్నా ఇంకా అవుట్ పుట్ అనుకున్న ప్రకారం రాలేదనడం సరికాదని అంటున్నారు..!!