టాలీవుడ్.. బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ కెరీర్‌లో గేర్ మార్చింది. తన తర్వాతి సినిమా రష్మీ రాకెట్ కోసం రెడీ అవుతూ.. ఫిట్‌నెస్ పర్‌ఫెక్ట్‌గా పెంచేస్తుందట. రాబోయే సినిమాకు ఓ అథ్లెట్ పాత్ర పోషిస్తున్న తాప్సీ.. నేచురల్‌గానే ఫిట్‌నెస్ సాధించాలనుకుంటున్నట్లు ఎటువంటి ప్రత్యేకమైన స్టెరాయిడ్లు వాడకూడదని ఫిక్స్ అయిందట. ‘నా ట్రైనర్లకు నేను చెప్పిన మొదటి విషయం ఎటువంటి స్టెరాయిడ్లు వాడకూడదని.
నన్ను సహజంగానే మార్చుకోవాలనుకుంటున్నా’ అని ఓ వీడియో పోస్టు చేసింది..రష్మీ రాకెట్ సినిమా.. అనేది ఓ స్పోర్ట్స్ డ్రామా. ఆకర్ష్ ఖురానా డైరక్షన్ లో వచ్చిన సినిమా. రోన్నీ స్క్రూవాలా, నేహా ఆనంద్, ప్రంజల్ ఖాంద్ధీయా నిర్మాతలుగా సినిమా రెడీ అవుతుంది. Tapsee ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుండగా ఇతర పాత్రల్లో ప్రియాంషు పైయూలీ, అభిషేక్ బెనర్జీలు కనిపించనున్నారు. రష్మీ రాకెట్ లో Tapsee ఓ స్ప్రింటర్ రోల్ లో కనిపిస్తున్నారు. అందిన రిపోర్టుల ప్రకారం.. సినిమా వచ్చే ఏడాది దీపావళి నాటికి థియేటర్లలో రిలీజ్ కానుంది..