in

Finally, Surekha Vani’s Daughter supritha Debuts!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. తల్లిగా, వదినగా, అక్కగా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించిన ఈ అమ్మడు..గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి సురేఖవాణి కూతురు సుప్రిత గురించి తెలియకుండా ఉండదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన హాట్ ఫొటోస్‌తో కూరకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్న సుప్రీత.. ఇప్పుడిప్పుడే సినిమాలో ఆఫర్లను కూడా అందుకుంటుంది..

ఇక సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్‌తో 2019లో మనీ మైండెడ్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ షార్ట్ ఫిలిం తో నటిగా కెరీర్ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ఈ షార్ట్ ఫిలిం తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించింది. తర్వాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రి పోతే పోవే.. అనే కవర్ సాంగుల్లోను ఆకట్టుకుంది. ఇవన్నీ సూపర్ హిట్ కావడంతో.. ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అందంతో పాటు..తన అభినయంతోను హీరోయిన్ మెటీరియల్ గా ప్రూవ్ చేసుకున్న సుప్రీత..సినిమాల్లో అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది..!!

Shraddha Kapoor to rent Hrithik Roshan’s apartment?

Saripodhaa Sanivaaram Over all Review!