in

finally anil ravipudi gives clarity about 3rd hero in ‘f3’!

F2 చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఎఫ్ 3 సినిమాను ఇటీవ‌ల మొద‌లు పెట్టారు అనీల్ రావిపూడి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో ఎలాంటి గొడవలు జరుగుతాయో ఎఫ్-2లో చూపిస్తే.. ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల ఫ్యామిలీలో ఎదురయ్యే సమస్యలను చూపించబోతున్నారు. ఈ విష‌యం కాన్సెప్ట్ పోస్ట‌ర్ ద్వారా క్లియ‌ర్‌గా అర్ధ‌మైంది. అయితే ఎఫ్ 3 టైటిల్‌ని బ‌ట్టి ఈ సినిమాలో ముగ్గురు హీరోస్ ఉంటార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ర‌వితేజ‌, మ‌హేష్ బాబు, గోపిచంద్‌ ల‌లో ఒక‌రు ఎఫ్ 3లో న‌టిస్తార‌ని అప్ప‌ట్లో ప్రచారం జ‌ర‌గగా, దానిని అనీల్ రావిపూడి ఖండించారు. తాజాగా మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నాడ‌ని గాసిప్స్ పుట్టించారు. దీనిపై స్పందించిన అనీల్ రావిపూడి ఎఫ్ 3లో మూడో హీరో ఉండ‌డ‌ని బ‌ల్ల‌గుద్ధి చెప్పాడు. త‌న‌కు మూడో హీరో ఆలోచ‌నే లేద‌ని కేవ‌లం ఇద్ద‌రు హీరోల‌తోనే సినిమా అంతా న‌డిపిస్తాన‌ని అన్నాడు. దీంతో పుకార్ల‌కు పులిస్టాప్ ప‌డ్డ‌ట్టు అయింది..

Allu Arjun and Vijay Devarakonda multistarrer with ‘Yatra’ director?

boney kapoor upset with rajamouli’s decision!