పూజాకు ఇంతకు ముందు బాలీవుడ్ సినిమాలు చేసినా సరే రాని గుర్తింపు మళ్ళీ మన దక్షిణాది సినిమా వల్లే వచ్చినట్లయ్యింది. కానీ లేటెస్ట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మన సౌత్ ఇండియన్ సినిమాపై చేసిన కామెంట్స్ పెద్ద రచ్చనే సోషల్ మీడియాలో రేపుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా వాళ్ళు అంతా నడుము మత్తులో ఉంటారని నవ్వుతూనే చెప్పింది. కానీ ఈ విషయం ఆమె ఏదో సిల్లీ గానే చెప్పేశా అనుకున్న వ్యవహారం మాత్రం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ కామెంట్స్ విన్న మన తెలుగు ఆడియెన్స్ అయితే కాస్త గట్టిగానే రిప్లై ఇస్తున్నారు.
అసలు సౌత్ ఇండియన్ సినిమా నుంచే స్టార్డం ను తెచ్చుకొని ఇప్పుడు ఇలా అంటుందా అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అయితే ఇప్పుడు పూజాకు కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి అంతలా మత్తు ఉంటే తాను మాత్రం ఎందుకు చూపించాలి అలా చూపించకుండా మన దగ్గర ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎంత మంది లేరు? అలాంటప్పుడు పూజా తన అవకాశాలను వదులుకోవచ్చుగా?అంటే తనకి ఇష్టం లేకుండానే నటించిందా? అలా అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ చెయ్యడం సరైనదేనా? ఇలాంటి వాటికి పూజా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.