in

fan shocks shreya at tirumala!

శ్రేయ శరన్ భట్నాగర్, దక్షిణాది చిత్రసీమలో శ్రేయ గ చాల పాపులర్ హీరోయిన్, సినీ సెలబ్రిటీస్ పబ్లిక్ లో కి వచ్చినప్పడు, కొన్ని ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మరికొన్ని బాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తుంటారు, ఫన్నీ అయితే ఓకే. కానీ బాడ్ ఎక్స్పీరియన్సెస్ జరిగినపుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతారు. అదే విధం గ శ్రేయ గారి కి జరిగిన ఒక బాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దానికి ఆమె ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకొందాం. శ్రేయ గారు ఒక సారి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, షరా మాములుగా మన టీ.వి, చానెల్స్ వాళ్ళు మైక్ లు పట్టుకొని ఆవిడను ఆపారు,వీళ్లకు ఒక సమయం, సందర్భం అవసరం లేదు సెలబ్రిటీ కనపడి తే మైకులు ముందు పెట్టడమే, ఈ హడావిడి లో, ఒక ఒక శునకానంద( అది వాడి పేరు కాదు) శ్రేయ గారిని రాసుకొంటూ వెళ్లి వెనకనుంచి ఆవిడ నడుము గిల్లాడు, ఒకింత ఆశ్చర్యానికి గురి అయిన శ్రేయ గారు వెనక్కు తిరిగి చూడగానే, శునకానంద ఎదో ఘనకార్యం చేసిన వాడిలా నవ్వుతు, మళ్ళీ గిల్లడానికి ప్రయత్నించాడు..

వాడి నవ్వు చూసి వళ్ళు మండిన శ్రేయ చుట్టూ వున్నా వాళ్ళ సంగతి మర్చిపోయి, ఆవేశం తో ఊగిపోతూ అపర కాళీ లాగ వాడిని పట్టుకొని ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు వాడి చెంప ఛెళ్ళు మనిపించారు, దెబ్బతో శునకానందుడికి దిమ్మ తిరిగి పోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వాడికి తగిన మర్యాదలు చేయటానికి తీసుకొని వెళ్లిపోయారు. ఎంత మంది ఈ విధం గ చేయగలరు చెప్పండి ? ఆకతాయిల ఆగడాలు మౌనంగా భరించటం వలనే వాడు మళ్ళీ ఇంకో చోట ఇటువంటి పనే చేస్తాడు, శ్రేయ గారి లాగా ధైర్యంగా బుద్ధి చెపితే ఇటువంటి శునకానందులు మళ్ళీ ఇటువంటి చర్యలకు పాలుపడాలి అంటే జంకుతారు. ఈ విషయం లో శ్రేయ గారి ధైర్యానికి మనమందరం ఒక విజిల్ వేయ వలసిందే, స్క్రీన్ మీదే కాదు రియల్ లైఫ్ లో కూడ హీరోయిన్ లాగా తుంటరి కి బుద్ధి చెప్పినందుకు, సెహబాష్, సెహబాష్ శ్రేయ గారు.

police arrested heroine kidnappers!

thamanna about nepotism!