in

Esha Gupta Questions Double Standards Of Haters Over Her Sultry Pics!

వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ తో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా తన ఫొటోల మీద వచ్చిన కామెంట్లపై మండి పడుతోంది. ఆడవారిపై ఎందుకీ వివక్ష అంటూ ఫైర్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈషా.. తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమాలను అలరిస్తుంటుంది. ఈ మధ్య ఈషా బాల్కనీలో సన్ బాతింగ్ చేస్తూ.. ఆ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కాగా.. ఆ ఫొటోలపై రకరకాల కామెంట్లు వచ్చాయి.

అయితే.. అందులో నెగెటివ్ కామెంట్ల మీద ఈషా గట్టిగానే స్పందించింది. ఇన్నిరోజులు నా మీద ట్రోల్స్ చేసే వారిని చూస్తే.. బాధపడేదాన్ని. ఇప్పుడు ఆ ట్రోల్స్ ను పట్టించుకోవడం లేదు. అసలు ఆ కామెంట్లు, ట్రోల్స్ కి స్పందించడం లేదు అంటోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో నేను షేర్ చేసిన ఫొటోలకు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. హీరోలు, మేల్ యాక్టర్లు ఫొటోలు షేర్ చేస్తే.. మీ బాడీ సూపర్ ఉంది.. అంటూ కామెంట్లు చేస్తారు. అలాంటిది అమ్మాయిల విషయంలో ఎందుకు వివక్ష అంటూ ప్రశ్నించింది ఈషా.

చీర కట్టుకున్న ఫొటోలు షేర్ చేస్తే వెటకారంగా.. ఈరోజు ఫుల్ డ్రెస్ ధరించారు అంటారు. మేకప్ వేసుకుంటే ప్లాస్టిక్ బ్యూటీ అంటారు. మేకప్ లేకుండా ఫొటోలు పెడితే.. మేకప్ వేసుకోవచ్చు కదా.. అంటూ ఉచిత సలహాలిస్తారు. అసలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని నిర్ణయించడానికి మీరెవరు? ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ల కట్టుబొట్లపై వివక్ష ఎందుకు? అంటూ ఫైర్ అయింది. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్. ఎవరైనా ఒక్క చెంప మీద కొడితే.. రెండు వాయించే రకం.. అస్సలు ఊరుకునే దాన్ని కాదు… అంటూ తన ఫొటోలపై వెకిలి కామెంట్లు చేసిన వారికి ఈషా బహిరంగంగానే గట్టి కౌంటర్ ఇచ్చింది.

Regina cassandra Trolled For Promoting Whiskey!

Junior NTR to work with Sanjay Leela Bhansali!