in

Regina cassandra Trolled For Promoting Whiskey!

తాజాగా ఓ హీరోయిన్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఫొటోతో ఆ హీరోయిన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అన్ ఫాలో కూడా అవుతున్నారు. ఇంతకు ఆ అమ్మడు ఎవరు..? ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఏంటి..? ‘శివ మనసులో శృతి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రెజీనా కాసాండ్రా. ఈ ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది రెజీనా. తెలుగులోనే కాదు తమిళ్‌లోను సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

అటు బాలీవుడ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ చిన్నది. అయితే ఇప్పుడు రెజీనా జోరు కొంత తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రెజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా రెజీనా ఓ మద్యం కంపెనీ ప్రేమోషన్స్ లో భాగంగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి.. ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుంద‌ని, ఈ మ‌ధుర‌క్ష‌ణాల‌ను మ‌ద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని రాసుకొచ్చింది. దాంతో ఈ ఫోటో పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి యాడ్స్ చేస్తావా అని కొందరు ఆమెను అన్  ఫాలో చేస్తున్నారు.

saloni aswani stills in a wrap dress!

Esha Gupta Questions Double Standards Of Haters Over Her Sultry Pics!