in

Dulquer Salmaan shocking comments on bollywood boycott culture!

బాయ్ కాట్ ట్రెండుకు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా,విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలు బలైన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా నెల రోజులు ముందు నుంచి ఈ బాయ్ కాట్ సెగ తగులుతూనే వస్తోంది. అయితే లక్కీగా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబడిందని చెప్పాలి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ రెండు నడుస్తున్నప్పటికీ పలువురు ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ..

దారుణమైన ఈ బాయ్ కాట్ కల్చర్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందనిసౌత్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించలేదు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత చివరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ట్రెండ్ చేస్తున్నారంటూ ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇక ఈ విషయం గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు మాట్లాడటానికి కూడా భయపడుతున్నారని ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడితే నేటిజన్స్ తమ సినిమాలను టార్గెట్ చేస్తారేమోనన్న భయంతో వాళ్లు కూడా బాయ్ కాట్ విషయంపై నోరు విప్పలేకపోతున్నారంటూ ఈ సందర్భంగా దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

big boss beauties ashu, ariyana back in news again!

Krithi Shetty launches an NGO to do charity!