in

DIsha Patani to enter Tamil Film Industry with ‘Suriya 42’!

సూర్య నటిస్తున్న 42వ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నది హిందీ తార దిశా పటానీ. చారిత్రక నేపథ్యంతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో త్రీడీ ఫార్మేట్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో అవకాశం రావడం ఉద్వేగంగా ఉందని చెప్పుకున్నది దిశా పటానీ. ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ..‘ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని చెప్పగలను. ఇప్పటిదాకా నేను కనిపించని సరికొత్త పాత్రలో నటిస్తున్నాను.

నా క్యారెక్టర్‌ వైవిధ్యంగా ఉంటుంది’ అని చెపింది..ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్‌ రాజా సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తు న్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ ఇటీవలే విడుదలైంది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతున్నారు. ఇటీవలే ఏక్‌ విలన్‌ రిటర్స్న్‌ సినిమాతో ప్రేక్షకుల ముందు కొచ్చిన దిశా..ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా ప్రాజెక్ట్‌ కె, యోధ, కె టీనా వంటి చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నది..!!

Amala Paul sensational comments on Tollywood families!

Rajamouli gives sensational update on Mahesh Babu’s Film!