in

dusky beauty pooja hegde bags another bollywood biggie!

కెరీర్ స్టార్టింగ్ నుంచే ఫ్లాప్స్ ఉన్నా..పూజా అందం వల్ల అవకాశాలు వచ్చాయి. క్రేజ్ వచ్చింది. కానీ, తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, ఏ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవ్వడంతో ఐరెన్ లెగ్ ట్యాగ్ వచ్చేసింది. టాలీవుడ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే దిక్కు అనుకున్న సమయంలో ఆ..సినిమా నుంచి కూడా బయటకు రావాల్సి వచ్చింది. దీంతో టాలీవుడ్‌కి టాటా..చెప్పిన బుట్టబొమ్మ..బాలీవుడ్ సినిమా ఛాన్స్ ల కోసం నానా తిప్పలు పడింది. ఫైనల్ గా ఓ భారీ ఆఫర్ వచ్చింది..

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న దేవా సినిమాలో హీరోయిన్ గా పూజా ఫైనల్ అయింది. ఛాన్స్ అయితే వచ్చింది కానీ, ఆమెకు ఉన్న బ్యాడ్ లక్ వల్ల సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే చిన్న టెన్షన్ మాత్రం ఉంది ఆమె అభిమానుల్లో. ఎందుకంటే పూజా ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయితే గ్లామర్ షో చేయడానికి ఎప్పుడూ నో చెప్పని పూజా, ఈ సినిమాలో కూడా అదే మంత్రా ను నమ్ముకుంటే బెటర్ అని చెబుతున్నారు సినీ క్రిటిక్స్. ఎందుకంటే ఒక వేళ సినిమాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, ఆమె ఫర్మామెన్స్‌కి అయినా మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. అప్పుడు మరో ఛాన్స్ అయినా వస్తుంది..!!

dil raju compares sreeleela with sridevi and Jaya Prada!

‘Bigg Boss’ beauty Subhashree gets a chance in Pawan Kalyan’s og!