in

Dhanush and Aishwaryaa Rajinikanth announce decision to divorce!

విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో ధనుష్ ఓ లేఖ ద్వారా వివరించాడు. వ్యక్తిగతంగా తాను, ఐశ్వర్య సమయం తీసుకోవాలని భావించామని… తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని,

ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత గోప్యత అవసరమని ధనుష్ విజ్ఞప్తి చేశాడు. కాగా హీరో ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌కు సోదరుడు. అటు ఐశ్వర్య రజనీకాంత్ పలు సినిమాలకు దర్శకత్వం వహించింది. ధనుష్ హీరోగా ‘3’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది. ఈ మూవీలోని వై దిస్ కొలవెరి సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. అయితే ధనుష్-ఐశ్వర్య మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్‌ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచే ధనుష్-ఐశ్వర్య దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

nidhi agarwal doubles her remuneration for ‘hero’!

‘Not a plastic doll’: Kriti Sanon opens up on being body-shamed!