in

devudi mida nammakam ledanna kamal!

1/2 సంవత్సరాలకే బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన కమల్ హాసన్ గారు తరువాత నటుడు అయిపోయి ఉంటారు అనుకొంటారు అందరు కానీ, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని, డాన్స్ మాస్టర్ తంగప్ప గారి దగ్గర అసిస్టెంట్ గ చేరారు. అప్పట్లో తంగప్ప గారు ఎక్కువ తెలుగు సినిమా లు చేస్తూ ఉండటం వలన అసిస్టెంట్ గ చేరిన కమల్ గారు శ్రీమంతుడు,( 1971) అనే సినిమా లో నాగేశ్వర రావు గారి తో స్టెప్స్ వేయించటానికి హైదరాబాద్ వచ్చారు.అప్పటికి కమల్ గారి కి 16 సంవత్సరాల వయసు,పూజ కార్యక్రమానికి దూరంగా నుంచున్న కుర్రాడిని అక్కినేని గారు పిలిచి దేవుడి మీద నమ్మకం లేదా అని అడిగారు,దానికి లేదంటూ , తల ఊపిన కమల్ ను చూసి ఇప్పుడు ఇలాగె అంటావు పదేళ్ల తరువాత కూడా ఇలాగె ఉంటావా అని అడిగారట. ఎందుకంటే అక్కినేని గారు కూడా దేవుడి కొంచెం దూరంగానే ఉండే వారు. పది, పన్నెండు సంవత్సరాల తరువాత నటుడిగా మారిన కమల్, అక్కినేని గారి ని కలవటం జరింగింది, గుర్తుపట్టిన అక్కినేని గారు ఏంటయ్యా ఇప్పటికి అలాగే ఉన్నావా అని అడిగారట, అవునని తల ఊపిన కమల్ ని చూసి, చూద్దాం ఇంకెంత కాలం ఇలాగే ఉంటావో అని నవ్వి వెళ్లిపోయారు అక్కినేని వారు.మళ్ళీ కమల్ అక్కినేని గారిని వారి  తొంభయ్యవ పుట్టిన రోజు ఫంక్షన్ లో కలుసుకున్నారు, అదే ప్రశ్న అక్కినేని గారి నుంచి మళ్ళీ అదే తల ఊపుడు కమల్ వైపు నుంచి, కానీ ఈ సారి కమల్, అక్కినేని గారిని ,సర్ మీరు ఇప్పటికి అలాగే ఉన్నారా అని అడిగారట అందుకు అక్కినేని  గారు పవర్ఫుల్ గ” ఎస్ మై డియర్ యంగ్ మాన్అన్నారు. వీరిద్దరి మధ్య సంభాషణ అంత ఇంగ్లీష్ లో నే జరిగేది, ఎందుకు చెప్పాను అంటే వీళ్లిద్దరు హై స్కూల్ పాస్ కూడా కాదు, కానీ ఇద్దరు జీవితాన్ని చదివిన వాళ్ళు, ఏ భాష అయినా మాట్లాడ గలరు, జీవితానికి కావలసింది డిగ్రీలు కాదు పరిశీలన దృక్పధం అని చెప్పటానికి నిదర్శనం వీరి జీవితాలు. యుక్త వయసులోని అభీప్రాయము జీవితాంతం కలిగి ఉండటం అటువంటి వారికె  సాధ్యం.

Leave a Reply

F CUBE ‘MM KEERAVANI’

Superstar training under Italian specialists!