in

deputy cm pawan: ‘og’ ante manalni kya ji antaru

వర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభలో ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ఒక్కసారిగా ‘ OG..OG ‘ అని అరిచారు. దీనిపై స్పందించిన పవన్..‘ నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా?. ముందు మాట ఇచ్చిన విధంగా ప్రజాసేవ చేసుకొనివ్వండి.

గ్రామాలకు కొత్త రోడ్లు కాదు కదా కనీసం గుంతలు కూడా పూడ్చలేదని జనాలు నన్ను తిట్టుకోకూడదు కదా. ఈ సమయంలో మనం ‘OG ‘ అంటే వాళ్లు ‘క్యాజీ ‘ అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడు రెండు మూడు రోజులు సినిమాలకు కేటాయిస్తాను. విషయంలో క్షమించమని ఇప్పటికే నిర్మాతలకు చెప్పాను. వాళ్ల పనికి అంతరాయం లేకుండా చేస్తానని చెప్పాను’ అని అన్నారు..!!

Sudheer Babu’s pan india Supernatural Mystery Thriller!

Nandamuri Balakrishna’s Son Mokshagna grand entry soon!