in

DELHI MODEL KETIKA SHARMA IN NTR-TRIVIKRAM MOVIE!

RRR పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాల్లో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తనకు ‘అరవింద సమేత’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే, ఇప్పుడు దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం… ఈ మూవీలో ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయట. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటిస్తున్న ‘రొమాంటిక్’లో హీరోయిన్‌గా చేస్తోంది కేతికా. దీనితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ నెంబర్ చేస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇన్ని ఆఫర్లు పట్టేస్తుండడంతో కేతిక టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

CONFIRMED,RAKUL BAGS ANOTHER BOLLYWOOD BIGGIE!

interesting TITLE FIXED FOR RAJ THARUN’S NEXT!