in

CONFIRMED,RAKUL BAGS ANOTHER BOLLYWOOD BIGGIE!

చాలా ఏళ్ల తరువాత మళ్లీ అజయ్ దేవగణ్ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతోన్నాడు. అది కూడా అమితాబ్‌ను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమాను నిర్మించబోతోన్నాడు. దర్శకుడు నిర్మాతగా ఉండటమే కాకుండా అజయ్ దేవగణ్ ఓ స్పెషల్ రోల్‌ను పోషించబోతోన్నాడు. మేడే అంటూ టైటిల్‌ను ఆ మధ్య రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో రకుల్‌కు ఓ మంచి ఆఫర్ వచ్చింది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అజయ్ దేవగణ్ రకుల్ కాంబోలో ఇంతకు ముందు దే దే ప్యార్ దే అనే చిత్రం వచ్చింది. అక్కడ ఏర్పడిన బంధంతోనే రకుల్ ప్రీత్‌కు మేడే సినిమాలో చాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను.. ఎంతగానో థ్రిల్ అయ్యాను.. మేడే చిత్రంలో ఎంపికవ్వడం కో పైలెట్‌గా నటించడం అది కూడా అమితాబ్ సర్ పక్కన.. నా కల ఈ రోజు నెరవేరింది.. నన్ను కూడా ఈ ప్రయాణంలో భాగం చేసి టేకాఫ్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని రకుల్ ట్వీట్ చేసింది.

RASHI KHANNA’S DESIRE TO ACT WITH THAT HERO!

DELHI MODEL KETIKA SHARMA IN NTR-TRIVIKRAM MOVIE!