in

deepika getting paid more than prabhas!

ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ప్రస్తుతం కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకి సంబందించిన వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తి చేసి స్క్రిప్ట్ కుడా లాక్ చేసాడని సమాచారం. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు దర్శకుడు. అతి ముఖ్యంగా హీరోయిన్ పాత్ర కోసం ముందుగా అలియా భట్ ను సంప్రదించగా.. ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ‘బ్రహ్మాస్త్ర’ వంటి సినిమాల తో బిజీగా ఉండటం.. వంటి కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించింది.

ఆ తరువాత మరో బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొనె ని సంప్రదించగా.. తన భర్త రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ’83’లో హీరోయిన్ గా నటిస్తున్నానని.. ఆ చిత్రం తరువాత నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అయతే, ఈ సినిమా కోసం ప్రభాస్ కంటే భారీ పారితోషికం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆ కండీషన్‌పైనే ఈ సినిమా ఒప్పుకుందని తెలుస్తుంది.

nagnam beauty in ‘ big boss 4’?

Trisha marrying that controversial hero?