in

‘Culture Is Not What You Wear!’ Kriti Sanon Breaks Silence on Ad Backlash!

టీవల ఆభరణాల సంస్థ GIVA రూపొందించిన రక్షాబంధన్‌ ప్రకటనలో కృతి ఆఫ్‌వైట్‌ దుస్తుల్లో కనిపించింది. బ్రాలెట్‌ స్టైల్‌ బ్లౌజ్‌, కేప్‌, డ్రేప్డ్‌ స్కర్ట్‌తో ఆమె కనిపించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీసింది. భారతీయ సంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులు సరైనవి కాదంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేసింది. దీనిపై కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. రక్షాబంధన్‌ అంటే రక్షణకు సంబంధించిన బంధమని పేర్కొంది. తాను, తన సోదరి ఒకరికొకరు రాఖీ కట్టుకుంటామని తెలిపింది. అన్న రక్షించినంతగానే తాము ఒకరినొకరు రక్షించుకోగలమని నమ్ముతామని చెప్పింది..

తమ ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించుకుంటామని వెల్లడించింది. తమ పెంపుడు కుక్కలు కూడా కుటుంబ సభ్యులేనని.. ఆ ప్రార్థనలో వాటికీ చోటు ఉంటుందని పేర్కొంది. మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవాన్ని అంచనా వేయడం సరికాదని కృతి పేర్కొంది. కాలంతో పాటు సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్‌లో మార్పులు వచ్చాయని తెలిపింది. అయినా మహిళల సంస్కృతిని వారి దుస్తుల ఆధారంగా ఎందుకు కొలుస్తున్నారని ప్రశ్నించింది. ‘సంస్కృతి, సంప్రదాయాలు మహిళ హృదయంలో ఉంటాయి..ఆమె దుస్తుల నెక్‌లైన్‌లో కాదు’ అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్‌ ఇచ్చింది..!!

fahad fazil, sj suryah are out, Riteish Deshmukh in for rapo23!