in

couples Saif Ali Khan and Kareena Kapoor to star in prabhas Spirit?

యంగ్‌ రెబల్ స్టార్‌ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్‌ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌ వంటి చిత్రాలతో ఇండియన్‌ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో సందీప్‌ రెడ్డి-ప్రభాస్‌ కాంబినేషన్‌ సినిమా వస్తుందనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు ఉండేలా సందీప్‌ వంగా జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ కపుల్స్ ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌, కరీనా కపూర్‌లు స్పిరిట్ మూవీలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ స్పిరిట్‌ మూవీలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం..!!

Anushka Shetty all set to marry Dubai Based Businessman?

dusky beauty Nidhi Agarwal And Simbu To Get Married Soon?