
చిరంజీవి గారు నటించిన “ఇంద్ర” సినిమా ఎంత హిట్ మూవీ అనేది మనందరికీ తెలుసు, అందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి, ఈ మూవీ కి మ్యూజిక్ అందించింది మణిశర్మ గారు, అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది, ఇందులో ఒక పాటకు ఆర్.పి. పట్నాయక్ గారు మ్యూజిక్ అందించారు, ఎందుకు ఆయన మ్యూజిక్ చేయవలసి వచ్చింది తెలుసుకోవాలంటే, ఈ వివరణ చదవండి. ఆర్తి అగర్వాల్ డేట్స్ కుదరక ఒక పాట పెండింగ్ పడింది, ఆవిడ డేట్స్ దొరకగానే వెంటనే రికార్డింగ్ చేసి పాట షూట్ చేయాలనుకున్నారు డైరెక్టర్ బి. గోపాల్ గారు, కానీ అదే టైం లో మణిశర్మ గారు ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు, ఏం చేయాలో అర్ధం కానీ డైరెక్టర్ గారు మణిశర్మ గారిని కాంటాక్ట్ చేసి విషయం చెప్పి, ఆర్. పి. గారితో ఈ పాట చేయిస్తాను అని అడగగానే ఆయన ఓ.కే. చెప్పటం” అయ్యయ్యయ్యో అయ్య్యయో చలి గాలి చంపేస్తుంది ” పాట కు ఆర్.పి. పట్నాయక్ గారు మ్యూజిక్ అందించటం జరిగింది.

