in

ANUSHKA PERU VENAKALA UNNA ASALU KATHA!

స్వీటీ అనే యోగ టీచర్ హీరోయిన్ ఎలా అయ్యింది, అనుష్క అని నామకరణం ఎవరు చేసారు తెలుసుకోవాలని ఉందా? అయితే చెపుతా వినండి. పూరి జగన్నాథ్ గారు సూపర్ సినిమా కి హీరోయిన్ కోసం వెతుకుతున్న రోజుల్లో, స్వీటీ ని కలుసుకున్నారు, యాక్టింగ్ తెలుసా, డాన్స్ తెలుసా అంటే తెలీదు అని చెప్పారట అప్పటి స్వీటీ. సరే అని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి నాగార్జున గారికి పరిచయం చేసారు పూరి గారు, అమ్మాయి బాగుంది అని ఓకే చెప్పేశారట,కొద్దీ రోజులు అవసరమయిన ట్రైనింగ్ ఇప్పించిన పూరి గారు షూటింగ్ స్టార్ట్ చేసారు, నాగార్జున గారు, నీ పేరు ఏంటి అని అడిగారట, స్వీటీ అని చెప్పగానే ముద్దు పేరు కాదు, అసలు పేరు ఏమిటి అని అడిగారట, స్వీటీ తన పాస్పోర్ట్ చూపించింది, అందులో ఆ పేరే ఉంది, వెంటనే నాగార్జున గారు ఈ అమ్మాయి కి పేరు పెట్టాలి స్వీటీ అంటే బాగోలేదు అన్నారట, వెంటనే పేర్లు సెలెక్ట్ చేయటం మొదలెట్టారట పూరి గారు,అప్పుడే సూపర్ మూవీ లో ఒక పాట పాడటానికి వచ్చిన అమ్మాయిని, పేరు అడిగితే అనుష్క అని చెప్పే సరికి, ఆ పేరును నాగార్జున గారికి చెప్పగానే ఎస్ బాగుంది ఈ పేరే కన్ఫర్మ్ చేయండి, అని స్వీటీ కి చెప్పారట, అయితే ఒక పని చేయండి ఒక రెండు రోజులు ఆలా నన్ను పిలుస్తుండండి, ఓకే అనిపిస్తే అదే కంటిన్యూ చేసేద్దాం అనింది స్వీటీ, ఇక అందరు ఆలా పిలవటం స్టార్ట్ చేశారట, స్వీటీ కి నచ్చింది అనుష్క అనే పేరు, చాల స్వీట్ గ అనిపించి ఓ.కే. చెప్పేసింది, ఆ రోజు నుంచి స్వీటీ కాస్త అనుష్క అయిందండి. ఇంత పేద్ద కధ ఉంది స్వీటీ, అనుష్క గ మారటం వెనుక.

I am scared of wearing saree: pooja

rakul talks about her gym workouts!