in

CHIRIGINA BATTALATHO CHIRANJEEVI PELLI!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు మెగా స్టార్ చిరంజీవి గారు. తన స్వయం కృషి తో ఒక్కో మెట్టు ఎక్కి శిఖరాన్ని అందుకున్న చిరంజీవి గారు తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ సాధించి తీరుగేలేని హీరోగా నిలిచారు..అయితే మెగా స్టార్ గురించి దాదాపు అన్ని విషయాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికి తెలిసే ఉంటాయి కదా. కానీ వారి పెళ్లి విషయం..అది ఎంత హడావుడి మధ్యలో జరిగిందో మీకు తెలుసా..తెలీకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. చిరంజీవి గారు తన పెళ్లి సమయంలో ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమాలో నటిస్తున్నారు.. అయితే ఈ సినిమాలో నటిస్తున్న వారంతా అప్పట్లో చాలా బిజీ ఆర్టిస్టులు అట, చిరు పెళ్లి డేట్ దగ్గరికి వచ్చేసరికి అదే సమయంలో ఆ సినిమాకు సంబంధించి ముఖ్యమైన సీన్స్ చిత్రీకరణ జరుగుతుందట. సినిమాకు బ్రేక్ ఇవ్వలేని పరిస్థితి, దింతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమో అనే గందర గోళంలో పడ్డారు చిరు. చిరు పరిస్థితిని అర్ధం చేసుకున్న నిర్మాత షూట్‌ను వాయిదా వేసి తన పెళ్లి కోసం గ్యాప్‌ ఇచ్చారట.దింతో ఫుల్ హ్యాపీ గ ఉన్న చిరు అదే ఉత్సాహంతో తన బట్టలు చిరిగి ఉన్నా చూసుకోకుండా పెళ్లి పీటల మీద కూర్చున్నారు. అది చూసి సురేఖ గారు ‘మీ బట్టలు మార్చుకోవచ్చుగా’ అని అడిగితె. ‘బట్టలు మార్చుకోవాలా..ఎందుకు ఇలా ఉంటె తాళి కట్టలేనా’ అంటూ మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడు అయ్యారు మన మెగా స్టార్.

RAKUL’S NEW YOUTUBE CHANNEL!

PRIYAMANI SLAPS A CRICKETER?