కరోనా వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. కంటికి కనిపించని ఈ ప్రణాంతక వైరస్ ప్రజలను ఆగమాగం చేస్తోంది. ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఏడాది గడుస్తున్నా.. ప్రపంచదేశాలను పట్టిపీడిస్తూనే ఉంది. ఇప్పటికే కరోనా కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరో ఈ వైరల్ బారిన పడ్డారు. సెలెబ్రెటీలను సైతం ఈ మహమ్మారి వదిలి పెట్టడం లేదు. తాజాగా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. తనకు కరోనా సోకినట్టు స్వయంగా చిరునే ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
`ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను.` అని చిరు పోస్ట్ పెట్టారు. దీంతో చిరు త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముకులు కోరుకుంటున్నారు. కాగా, చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ స్టాట్ కావాల్సిన సమయంలో చిరుకు కరోనా సోకడం ఆందోళనకరం.