చిరంజీవి గారు నటించవలసిన” కొండపల్లి రాజా” సినిమా లో వెంకటేష్ గారు నటించారు అది ఎంత నాటకీయంగా జరిగిందో తెలుకోవాలని ఉంటె ఈ కధనం చదవండి.ఏ. వి. వి. సత్యనారాయణ సీనియర్ నిర్మాత విక్టరీ వెంకటేష్ తో “సుందరకాండ” సినిమా నిర్మాణ సమయం లో, రజనీకాంత్ నటించిన “అన్నామలై” తమిళ్ సినిమా చూసారు మద్రాస్ లో ఆ సినిమా బాగా నచ్చిన ఆయన దాని హక్కుల కోసం ప్రయత్ననించి, భారీ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసారు. ఆ చిత్రంని చిరంజీవి గారితో నిర్మించాలి అనుకోని, హైదరాబాద్ వచ్చాక చిరంజీవి గారిని కలవాలి అనుకొంటూ, ఎయిర్ పోర్ట్ కు వచ్చారు,
మొక్కబోయిన దేవుడు, ఎదురు వచ్చినట్లు చిరంజీవి గారు ఫ్లైట్ లో కలిశారు, చిరంజీవి గారి కి ఫ్లైట్ లోనే కధ చెప్పారు,కధ నచ్చిన చిరంజీవి గారు హైదరాబాద్ వచ్చిన తరువాత కలవమన్నారు. ఫ్లైట్ దిగిన సత్యనారాయణ గారు ” సుందర కాండ” షూటింగ్ స్పాట్ కు వెళ్లారు.” అన్నామలై ” హక్కులు సత్యనారాయణ తీసుకొన్నారని తెలిసిన వెంకటేష్ గారు, ఆ సినిమా కూడా మనమే చేద్దాము అని డిక్లేర్ చేసారు, ఒక్క సారిగా షాక్ అయిన సత్యనారాయణ గారు అయోమయం లో పడిపోయారు, మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వదులుకోవలసి వచ్చింది. ఆ విధం గ చిరంజీవి గారు నటించవలసిన “కొండపల్లి రాజా” సినిమా వెంకటేష్ గారు సుమన్ గారితో కలసి నటించారు..