కాస్టింగ్ కౌచ్ తో వార్తల్లో నిలిచినా చిన్మయి..ఎప్పటికప్పుడు లైంగిక వేదింపులు ఫై స్పందిస్తుంటుంది. తాజాగా ఓ విషయంపై ఈమె వార్తల్లోకెక్కింది. న్యూడ్స్ పంపాలంటూ చిన్మయికి ఓ యువకుడు మెసేజ్ చేశాడు. ఆ యువకుడు చేసిన మెసేజ్‌కి షాకింగ్ రిప్లై ఇచ్చింది. ‘దయచేసి స్వయంతృప్తి చెందు. ఎలా చేసుకోవాలో తెలియకపోతే గైనకాలజిస్టుతో మాట్లాడు. వాళ్లు ఎలా చేయాలో చెబుతారు అలాగే హైజీన్ ప్రాక్టీస్ చేయి.
స్వయంతృప్తి చెందడం తప్పేకాదు..అని రిప్లై ఇచ్చింది. నువ్వు ఇలా మహిళలను న్యూడ్ పంపాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు, అది లైంగిక వేధింపుల కిందికి వస్తుంది. మనిషిగా ఉండడం నేర్చుకో, లేదా నీ తండ్రితో ఓసారి మాట్లాడు. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో ఆయన నీకు నేర్పిస్తాడని నమ్ముతున్నా.ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్మయి రిప్లై కి చాలా మంది నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు..