in

Chinmayi trashes pregnancy rumour!

టీవల చిన్మయి తన భర్త రాహుల్‌ రవిచంద్రన్‌ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్‌లో పుకార్లు రేగాయి. రూమర్స్‌పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సుధీర్ఘ పోస్టు పెట్టారు.

‘ఇది మా పెళ్లి ఫోటో. ఇందులో నేను మడిసార్‌ ధరించారు. దాన్ని క్యారీ చేయడంలో నాకు సమస్యలు ఉన్నాయి. మడిసార్‌ కారణంగా నా ఉదరం పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నేను గర్భవతిని కాదు. చిన్మయి బేబీ బంప్‌ అంటూ యూట్యూబ్‌ ఛానల్స్‌ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్‌తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయిన నా పర్సనల్‌ లైఫ్‌ విషయాలు షేర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు.

‘Love Story’ and ‘most eligible bachelor’ on Aha!

disha patani raises heat!