in

chay sam divorce: Kangana Ranaut blames Aamir Khan!

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకుల అంశం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంత, నాగచైతన్య విడిపోవడానికి ఓ బాలీవుడ్‌ హీరోనే కారణమంటూ షాకింగ్‌ పోస్ట్‌ చేసింది. ‘10 ఏళ్లుగా ప్రేమ బంధంలో ఉండి, నాలుగేళ్లుగా వివాహా బంధంలో ఉండి.. విడాకులు తీసుకున్న ఓ సౌత్‌ ఇండియన్ హీరో ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరోను కలిశాడు. ఆ బాలీవుడ్‌ హీరోకు విడాకుల స్పెషలిస్ట్‌గా పేరుంది. అతను ఎంతో మంది మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు.

ఆయన సూచనలు, సలహాల మేరకే సౌత్‌ హీరో విడాకులు తీసుకున్నాడు’అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కంగనా కామెంట్‌ చేసింది. దీంతో పాటు ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై కూడా కంగనా కామెంట్‌ చేసింది. ఏ జంట విడాకులు తీసుకున్నా.. దానికి మూల కారణం పురుషుడే. ఎందుకంటే దేవుడు స్త్రీ, పురుషులను అలాగే సృష్టించాడు. విడాకుల సంస్కృతి రోజురోజుకీ బాగా పెరిగిపోతుందని కంగనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమిర్‌ ఖాన్‌ ను ఉద్దేశించే కంగనా ఆ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నాగచైతన్య ఇటీవల అమీర్‌ ఖాన్‌తో కలిసి లాల్‌ సింగ్ చద్దా అనే సినిమాలో నటించారు.

sony charishta glamorous stills in pink saree!

Sonakshi Sinha opens up on relationships and marriage!