నిన్న మొన్నటి ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నట్టుగా ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందో ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీ కు డిమాండ్ ఒక రేంజ్ లో పెరిగింది. హీరోయిన్ గా అడపాదడపా సినిమాలు చేస్తూ ఏదో ఒక విధంగా కాలం నెట్టుకొస్తున్న మీనాక్షి చౌదరి కు గోల్డెన్ ఛాన్స్ గా గుంటూరు కారం సినిమా తగలడంతో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో నటించే ఛాన్స్ లు వస్తున్నాయి. దాంతో మీనాక్షి రెమ్యునరేష్ కూడా ఒక్కసారిగాపెంచినట్టు తెలుస్తోంది.
chaudhary’s girl meenakshi hikes her price!
గుంటూరు కారం సినిమా పుణ్యమా అని ఇటీవలనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో నటించే అవకాశం కొట్టేసిన మీనాక్షి చౌదరి ఆ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట. అయితే ఒప్పుకున్నా పెళ్లికి వాయించాక తప్పుతుందా అని మీనాక్షి ని హీరోయిన్ గా తీసుకుందామనుకుంటున్న మేకర్స్ కూడా ఆమె ఆడినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. దీనిబట్టి చూస్తే మీనాక్షి చౌదరి టైర్ టూ హీరోయిన్ సెక్షన్ నుంచి స్టార్ హీరోయిన్ సెక్షన్ ను షిఫ్ట్ అయినట్టే ఉంది.!!