in

Cadbury girl bhagyashri borse to romance ravi teja!

రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో సినిమా తెరకెక్కుతోంది. అయితే.. సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే విషయమై పలువురి పేర్లు వార్తల్లో నిలిచాయి. పలువురు హీరోయిన్లు రిజెక్ట్ చేశారనే న్యూస్ కూడా వైరల్ అయింది. అయితే..వీటికి హరీశ్ నిరాధార వార్తలుగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ అన్ని వార్తలకు చెక్ పెట్టింది.

మహారాష్ట్రకు చెందిన బాలీవుడ్ యువనటి ‘భాగ్యశ్రీ బోర్సే’ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది హిందీలో వచ్చిన ‘యూరియన్ 2’ సినిమాలో చిన్న పాత్రలో నటించి తన అందంతో ఆకట్టుకుంది. దీంతోపాటు పలు యాడ్స్ లో నటించి పాపులర్ అయింది. వీటిలో క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ యాడ్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు..!!

Rajamouli Buys First Ticket Of ‘Salaar’!

K.V.REDDY THE KING OF DIRECTORS!