in

Britney Spears to collaborate for chiranjeevi’s ‘Godfather?’

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

పాపులర్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో ఇప్పుడు “గాడ్ ఫాదర్” మూవీ కై ఒక సాంగ్ పాడించనున్నారని సమాచారం. బ్రిట్నీ స్పియర్స్ గురించి పాప్ సాంగ్స్ వినేవారికి సుపరిచితమే. ఆమె ప్రముఖ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్., డ్యాన్సర్ కూడా. తన ఆట పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. బ్రిట్నీ స్పియర్స్ సాంగ్ తోడయితే “గాడ్ ఫాదర్” మూవీ క్రేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ తోనే మేకర్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం.

Akhil Wants To Do Virat Kohli’s Biopic!

samantha bags crazy bollywood movies!