in

samantha bags crazy bollywood movies!

నాగ చైత‌న్య, సమంత ఇటీవల తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి స‌మంతపై ఎన్నో అబ‌ద్ద‌పు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వాటిపై సమంత స్పందిస్తూ అవ‌న్నీ రూమ‌ర్స్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే శాకుంత‌లం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సమంత ప్రస్తుతం ఓ త‌మిళ సినిమా షూటింగ్‌ తో బిజీగా ఉంది.

తాజాగా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్రమానికి కూడా సమంత హాజరయ్యారు. స‌మంత‌ చేతిలో మరో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఫ్యామిలీ మ్యాన్- 2 వెబ్ సిరీస్ త‌ర్వాత స‌మంత‌కు బాలీవుడ్ ఆఫ‌ర్స్ బాగా వ‌స్తున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఓ క్రేజీ ఆఫ‌ర్‌ ని స‌మంత యాక్సెప్ట్ చేసింద‌నే ప్ర‌చారం జరుగుతోంది. అతి త్వ‌ర‌లోనే సమంత చేయనున్న సినిమాలపై పూర్తి క్లారిటీ రానుంద‌ని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాలు మొదలైతే, మనసును ఆ వైపు మళ్లించవచ్చని సమంత భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Britney Spears to collaborate for chiranjeevi’s ‘Godfather?’

Being a Producer Made Me a More Humble Actor : avika gor