నటుడు బ్రహ్మాజీ..ఓ పక్క సినిమాలు చేస్తూనే.. సోషల్ మీడియా లోయాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలకు సంబందించిన విషయాలే కాక మిగతా విషయాలు సైతం షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంటాట్రు. తాజాగా ఈయన హైదరాబాద్ వరదల పట్ల చేసిన ట్వీట్స్ ఈయన్ను ట్విట్టర్ నుండి బయటకు వచ్చేలా చేసింది. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గడిచిన 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది.
ఈ నేపథ్యంలో తాను నివసిస్తోన్న ఇంటి వద్ద ప్రాంతం చెరువును తలపించినట్లు చెపుతూ పిక్స్ పోస్ట్ చేసారు. ‘‘ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా.. దయచేసి ఏదైనా మంచి పడవ గురించి సలహా ఇవ్వండి’’ అని సరదాగా ట్వీట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేయడం మాని సెటైర్లు వేస్తావా అంటూ కొంత మంది నెటిజన్లు బ్రహ్మాజీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ ట్రోల్స్ తట్టుకోలేక బయటకు వచ్చాడు.