in

boyapati srinu wants thaman to be replaced for akhanda 2 music?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ సంచలన విజయం సాధించడంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. థమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో థమన్ అఖండ సీక్వెల్ కు సంబంధించి కొన్ని అప్ డేట్స్ సైతం ఇవ్వడం జరిగింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అఖండ సీక్వెల్ తెరకెక్కనుండగా ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. యానిమల్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అఖండ సీక్వెల్ కు మాత్రం థమన్ కే ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి..థమన్ అఖండ సీక్వెల్ కోసం పని చేస్తున్నారో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా అఖండ సీక్వెల్ కు నో చెప్పే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు..!!

Prabhas reduces His Remuneration For ‘Raja Saab’!

Most awaited sequels of blockbuster hit films in Tollywood!