బిందు మాధవి కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో ఆమె ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అయిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనదైన ఆటతీరుతో అలరిస్తున్న తెలుగమ్మాయికి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల అండతో టైటిల్ హాట్ ఫేవరేట్‌గా దూసుకుపోతున్నారు. అయితే ఈ రియాలిటీ షోలో తన ఆటను సపోర్ట్ చేస్తూ తమిళ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ఓ పోస్ట్ పెట్టాడు.
‘నా ప్రియమైన స్నేహితురాలు బిందు మాధవికి శుభాకాంక్షలు. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో బాగా ఆడుతున్నావ్’ అంటూ హరీష్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం యువ హీరో హరీష్ కళ్యాణ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. దాంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు బిందుకి హరీష్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. ఇద్దరిలో ఒకరు స్పందించాల్సి ఉంది.