in

big boss fame divi interesting comments about mahesh babu!

హేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో దివి చిన్న రోల్ లో కనిపించారు. తాజాగా దివి మహర్షి సినిమా షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబును చూసి తాను సిగ్గుపడిపోయానని దివి తెలిపారు. మహర్షి సినిమా దివికి తొలి సినిమా కాగా సెట్ లో మహేష్ బాబు చాలా అందంగా కనిపించారని దివి అన్నారు. తొలి సినిమాలోనే మహేష్ బాబుతో పని చేశానని దివి కామెంట్లు చేశారు.

అమ్మాయిలం ఒకవైపు కూర్చుని ఉన్నామని మహేష్ బాబు మా ముందునుంచి వెళ్లగా ఎంత బాగున్నాడో అని అనుకున్నామని దివి వెల్లడించారు. నాకు తెలియకుండానే మహేష్ తో బాండింగ్ ఏర్పడిందని కెరీర్ మహేష్ సినిమాతో మొదలైంది కాబట్టి తనకు ఆ ఫీలింగ్ కలిగిందని దివి వెల్లడించారు. మహేష్ బాబు హెయిర్ స్టైల్ కానీ స్కిన్ టోన్ కానీ మరో లెవెల్ లో ఉంటాయని దివి అన్నారు.

మహర్షి సినిమాలో తాను ఐదు సీన్లలో నటించానని అయితే ఆ సీన్లలో చాలా సీన్లు ఎడిటింగ్ లో కట్ చేశారని దివి కామెంట్లు చేశారు. మహేష్ బాబుతో ఒక ఫ్రేమ్ లో కనిపించినా ఒక బిట్ లో కనిపించినా చాలని దివి వెల్లడించారు. మహేష్ గురించి దివి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న దివికి తెలుగు సినిమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ షో దివి కెరీర్ కు ఉపయోగపడిందనే చెప్పాలి.

avika gor gorgeous pics in red dress!

dimple hayathi tests positive even after taking two doses of vaccine!