in

big boss Ariyana Glory meets RGV in Goa!

 

ప్రస్తుతం శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా లు గోవాలో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగు రోజులుగా ఈ గ్యాంగ్ గోవాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆర్జీవీని తన కార్యాలయంలో అరియానా కలిశారు. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది.

బిగ్ బాస్ షో కంటే ముందు అరియానాకి పెద్దగా గుర్తింపు లేదు. ఆమె రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగానే ఫేమస్ అయింది. ఒకానొక సమయంలో బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ రేసులోకి కూడా దూసుకొచ్చింది అరియనా. ఆర్జీవీ కూడా అరియానాకు ఓ అభిమానే. ఈ నేపథ్యంలో వర్మ ఆమెకు ఓటేయమంటూ సోషల్‌ మీడియా వేదికగా మద్దతు తెలిపాడు. ఆయన ఫ్యాన్స్ కూడా అరియానాని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

One More Record In Samantha’s Account!

Shweta Basu responds On Why Divorce From Rohit Mittal!