విజయ్ ఆంటోనీ అని పేరు చెప్పగానే ఎవరితను, ఏం కావాలిట అనకండి, మన “బిచ్చగాడు” సినిమా హీరో, ఆ ఇప్పుడు గుర్తు పట్టేసారు కదూ. ఆ సినిమా టైటిల్ మాత్రమే బిచ్చగాడు, కలెక్షన్స్ లో కోటీశ్వరుడు అని చెప్పాలి.విజయ్ ఆంటోనీ సినిమాలో లాగానే బయట కూడా చాల కామ్ అండ్ క్వయిట్ , అటువంటి విజయ్ ఆంటోనీ ఏం చేసాడో తెలుసా ఇంటర్వ్యూ చేయటానికి వచ్చిన జర్నలిస్ట్ ని మొదటి చూపులోనే లవ్ లో పడేసి పెళ్లి చేసుకున్నాడు.ఒక సినిమా సక్సెస్ మీట్ లో ఆంటోనీ ని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చింది జర్నలిస్ట్ ఫాతిమా. ఆంటోనీ విసిరిన చూపుల బాణానికి ఫ్లాట్ అయిపొయింది ఫాతిమా, కుదిరితే కప్పు కాఫీ వంటి బీటింగ్ అరౌండ్ ది బుష్ కార్యక్రమాలు ఏమి లేకుండా డైరెక్ట్ గ విషయం లోకి వచేసారట ఇద్దరు. ఆఫీసియల్ ఇంటర్వ్యూ తరువాత, పర్సనల్ ఇంటరాక్షన్ అయిపొయింది..
ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చటం, మనసులు ఇచ్చి పుచ్చుకోవటం జరిగిపోయాయి. థిస్ ఇస్ కాల్డ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుంటూ, ఆమెతో కొంత కాలం లాహిరి లాహిరి లాహిరిలో అంటూ ప్రేమ నావ యాత్ర చేసాక, 2006 లో వివాహం చేసుకున్నారు. విజయ్ ఆంటోనీ కి ఒక కూతురు కూడా ఉంది ఇప్పుడు, ఆమె పేరు లారా. ఇక్కడ హై లైట్ ఏమిటంటే మ్యూజిక్ డైరెక్టర్ గ సినీ రంగ ప్రవేశం చేసిన విజయ్ ఆంటోనీ, ఆ తరువాత హీరో గ, సినిమా ఎడిటర్ గ, నిర్మాత గ పలు రంగాలలో సక్సెస్ సాధించారు. ఇంకొక విషయం ఏమిటంటే తన సంపాదన లో సగానికి పైగానే సామాజిక సేవకు ఖర్చు పెడుతుంటారు మన మనసున్న బిచ్చగాడు, విజయ్ ఆంటోనీ. ఈ విషయాన్ని మూడో కంటికి కూడా తెలియనీయరు అయన, ఇదో గొప్ప సుగుణం విజయ ఆంటోని లో ఉంది. పేరుకే బిచ్చగాడు కానీ మనసున్న మారాజు విజయ్ ఆంటోనీ..!!