సీనియర్ హీరోయిన్ భూమిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్న భూమిక టాప్ 5 హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా భూమిక కు ఖుషి, ఒక్కడు సినిమాలు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అయితే ఆ తరువాత భూమిక పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత గ్యాప్ తీసుకున్న భూమిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆభూమిక హీరో అక్కగా, హీరోయిన్ అక్కగా, వదిన గా చిన్నా చితక పాత్రలు చేస్తుంది.
అనుకున్న స్థాయిలో అవకాశాలు కూడా రావటం లేదు..అయితే భూమికకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవటానికి కారణం సెలబ్రిటీలతో పెద్దగా కలసిమెలసి తిరగకపోవటం, పార్టీలకు వెళ్లకపోవటమే అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి ఇదే విషయమై స్పందించారు భూమిక. పార్టీలకు వెళ్తేనే దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారా… లేకపోతే ఇవ్వరా అలాంటి మాటలను నేను ఒప్పుకోను, నా కోసం పాత్రలు రాసి నా కోసం వెతుక్కుంటూ వచ్చిన దర్శక నిర్మాతలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. భూమిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.