in

RAMYA KRISHNA TO PLAY CHIRANJEEVI SISTER?

చిరంజీవి పక్క‌న ఎంతో మంది క‌థానాయిక‌లు హీరోయిన్స్‌గా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. అందులో ర‌మ్య‌కృష్ణ ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే హవా చూపిస్తూ స్ట్రాంగ్ పాత్ర‌లు పోషిస్తుంది.

తాజాగా ర‌మ్య‌కృష్ణ‌.. చిరంజీవి చెల్లెలుగా న‌టించ‌నుంద‌నే వార్త వైర‌ల్‌గా మారింది. చిరు ప్ర‌స్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్స చేస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే ఓ మహిళ పాత్ర చాలా కీలకం కానుందట. దీంతో ఈ బలమైన రోల్ కోసం శోభన, విద్యాబాలన్ లాంటి వాళ్ళ పేర్లను పరిశీలించిన టీమ్ చివరకు రమ్యకృష్ణను ఫైనల్ చేశారని సమాచారం.

ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిరు చెల్లెలిగా వెండితెరపై మెప్పించడానికి రమ్యకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్‌లో స్వల్ప మార్పులు ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్‌ కనిపించనుండగా.. అతిథి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నారనే టాక్ బయటకు రావడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

kajal aggarwal trying to bring her husband into movies?

actress janhvi kapoor at elle beauty awards!