in

yamudiga adaragottina superstar krishna!

కృష్ణ గారు తన సుదీర్ఘమయిన సినీ ప్రయాణం లో ఎన్నో విభిన్నమయిన పాత్రలు పోషించారు, కృష్ణ గారు యముడి పాత్ర కూడా పోషించారు మీకు తెలుసా?. నిజ జీవితంలో యెన్.టి.ఆర్. కి వీరాభిమాని అయిన కృష్ణ గారు యెన్ .టి.ఆర్. లాగా విభిన్నమయిన పాత్రలు పోషించాలని ఆసక్తి చూపే వారు. అందుకు తగినట్లుగా తాను నటించే చిత్రాలలో ఎన్నో మారు వేషాలు ధరిస్తుండే వారు, ఆ విధంగా” అసాధ్యుడు” అనే చిత్రంలో అల్లూరి సీతారామరాజు గ కనిపించారు అదే ఆయనకు అల్లూరి సీతారామరాజు చిత్ర నిర్మాణానికి స్ఫూర్తి గ నిలిచింది.

అదే విధంగా” అఖండుడు” అనే చిత్రంలో కపట పాత్ర ధారి అయిన అల్లు రామలింగయ్య తో నిజం చెప్పించటానికి, నాటకరాయుళ్లు అయిన మిత్ర బృందం తో కలసి యమలోకం సెట్ వేసి, రామలింగయ్య గారిని చనిపోయినట్లు నమ్మించి నిజం చెప్పించటానికి, ఆ చిత్రం లో యముడి గ నటించారు కృష్ణ గారు. యముడి గెట్ అప్ లో ఎంతో గంభీరంగా కనిపిస్తారు కృష్ణ గారు, ఆ పాత్ర కు అప్పటి ప్రముఖ గాయకుడు మాధవపెద్ది సత్యం గారు గాత్ర దానం చేసారు.

actress janhvi kapoor at elle beauty awards!

Bhumika shocking Comments On Movie Offers related to private uparties!