in

Bhagyashri Borse confirmed the relationship with rapo?

కొంతకాలంగా రామ్, భాగ్యశ్రీ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన‌ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా సెట్స్‌లో ఈ ప్రచారానికి బీజం పడింది. గతంలో ఈ వార్తలపై రామ్ పోతినేని స్పందించి, వాటిని ఖండించారు. అయితే, భాగ్యశ్రీ మాత్రం ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు. ఇటీవల ‘లెనిన్’ సినిమా ప్రమోషన్లలో “హైదరాబాద్ నాకు రెండో ఇల్లు” అని ఆమె చెప్పడంతో ఈ ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా, “మీరు కలిసి పనిచేసిన హీరోల్లో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?” అనే ఆసక్తికరమైన ప్రశ్న భాగ్యశ్రీకి ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ..అఖిల్ అక్కినేని తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అయితే, డేటింగ్, పెళ్లి విషయానికి వచ్చేసరికి, తాను కలిసి నటించిన వారిలో పెళ్లికాని హీరో ఒక్కరే ఉన్నారంటూ నవ్వేశారు. ఆమె పరోక్షంగా రామ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు..!!

Nagarjuna and ‘Bommarillu’ Bhaskar teaming up?

‘Fauji’ Starring Prabhas Set for December 3, 2026 Release!