in

Nagarjuna and ‘Bommarillu’ Bhaskar teaming up?

నాగార్జున తన నెక్స్ట్ సినిమాల లైన్అప్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో, ఇకపై కేవలం హీరోగా మాత్రమే నటించాలని నాగ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ఒక లైన్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భాస్కర్ ఈ స్క్రిప్ట్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడట..

గతంలో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి మంచి విజయాన్ని అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్, ఇటీవల సిద్ధు జొన్నలగడ్డతో చేసిన ‘జాక్’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా కష్టపడి రాసుకున్న ఒక బలమైన కథను ఆయన నాగార్జునకు వినిపించాడు. ఈ కథ నాగ్‌కు ఎంతగానో నచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది..!!

Sreeleela misses out on yet another biggie!