తెలుగు చిత్రసీమలో కొన్నేళ్ల క్రిందట వరుస విజయాలతో దూసుకుపోయిన చెన్నై చిన్నది రెజీనా ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనకబడింది. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు హిందీలో బంపరాఫర్‌ను సొంతం చేసుకుందని తెలిసింది. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఛత్రపతి’ తెలుగు కథాంశాన్ని హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. తెలుగు మాతృకలో శ్రియ పోషించిన పాత్రలో రెజీనా కనిపించనుంది. హిందీలో ఆమె నటిస్తున్న రెండో చిత్రమిది కావడం విశేషం. తొలుత ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాణీని తీసుకోవాలని అనుకోగా డేట్స్ సర్దుబాటు లేని కారణంగా ఆమె అంగీకరించలేదని తెలిసింది. ప్రస్తుతం రెజీనా తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తోంది.