in

beauty Janhvi Kapoor is all set for her Tamil debut!

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ త్వరలోనే తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పా రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘కురతి’ అనే లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ ద్వారా ఆమె కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సర్కునమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సోషల్ డ్రామా కథల ఆధారంగా సినిమాలు నిర్మించే పా రంజిత్ ఈ ప్రాజెక్ట్ వెనుక ఉండటంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీపై గట్టిగా దృష్టి పెట్టిన జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. రీసెంట్‌గా రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలోనూ ఆమె నటించింది. ఎప్పటినుంచో తమిళ సినిమాల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తపరుస్తున్న ఆమె, ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ద్వారా తమిళ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో ‘లగ్ జా గలే’ అనే సినిమాలోనూ నటిస్తుంది..!!

Jr NTR Shares Health Update After Shoulder Surgery!