షణ్ముఖ్ కి దమ్ముంటే మగాడిలా ఆడాలని.. లేదంటే గాజులేసుకుని కూర్చోవాలని సరయు చేసిన ఘాటు వ్యాఖ్యలు షణ్ముఖ్ ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియాలో సరయు పై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. దీంతో సరయు రియాక్ట్ అయింది. ‘బిగ్ బాస్ నుండి బయటికొచ్చాకా కంటెస్టెంట్స్ పై వీడియోలు చేయాలనీ అనుకోలేదు.. కానీ రెండు సంఘటనల కారణంగా నేను ఈ వీడియో చేయక తప్పడం లేదంటూ’.. సరయు వీడియో రిలీజ్ చేసింది. ‘షణ్ముఖ్ ఫ్యాన్స్ పేరుమీద కొందరు నాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో తిడుతున్నారంటూ’ ఆరోపణలు చేసింది సరయు. ‘ఎవరో షణ్ముఖ్ ఫ్యాన్స్ అంట.. నన్ను అసభ్య పదజాలంతో తిడుతున్నారు. కొందరైతే బెదిరిస్తూ కాల్స్ కూడా చేస్తున్నారు. వారందరికీ నేను ఒకటే చెప్తున్న. ఈ రోజు నేను సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప పై జరిగిన ఘటనకి స్పదింస్తు.. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న. నన్ను బెదిరిస్తూ తిడుతున్న వారికి దమ్ముంటే అక్కడికి రండి. ఆ చిన్నారి పేరెంట్స్ కి సపోర్ట్ చేయండి. ఆ తరువాత నాపై అటాక్ చేయండి. షణ్ముఖ్ ని అన్న చిన్న మాటకే నను టార్గెట్ చేస్తున్నారు. నా వీడియోలు మొత్తం బిగ్ బాస్ లో టెలికాస్ట్ అవ్వలేదు.. నా దెగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ కి ఛాలెంజ్ విసిరింది సరయు.