ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కరోనా దెబ్బకు ఈ సినిమా మరో ఏడాదికి పోస్ట్ ఫోన్ అయిపోయింది. కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తన తరువాత సినిమాని బాలయ్యతో చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం బాలకృష్ణ రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చివర్లో బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో సినిమా వచ్చే అవకాశం ఉందట. ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అట. కమర్షియల్ ఫార్ములాను ఫాలో అయ్యే దర్శకుల్లో ఫన్ మీద ఎక్కువగా దృష్టిపెట్టే డైరెక్టర్ అనిల్. అందుకే ఆయనకు డిమాండ్ బాగా పెరిగింది. చిన్న హీరోల దగ్గర్నుండి స్టార్ హీరోల వరకు అందరూ ఆయనతో వర్క్ చేయడానికి సిద్దంగా ఉన్నారు.