in

Kiara Advani is the first choice for Ram Charan’s next with Shankar!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత డైరెక్టర్ శంకర్ తో ఓ మెగా ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నాడు. జూన్ నుంచీ షూటింగ్ ప్రారంభమయ్యే శంకర్ మూవీపై ఇప్పుడు అందరి దృష్టీ పడుతోంది. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందనున్న సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. చరణ్‌ తో శంకర్ తీయబోయే సినిమాలో కియారా అద్వాణీ ఫీమేల్ లీడ్ అంటూ టాక్ వినిపిస్తోంది. గతంలో ‘వినయ విధేయ రామ’లో చెర్రీ, కియారా రొమాన్స్ చేశారు.

ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం నిరాశపరిచినా మెగా పవర్ స్టార్ తో ముంబై బ్యూటీ కెమిస్ట్రీ చాలా మందికి నచ్చింది. మరోసారి ఈ ఇద్దర్నీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, డైరెక్టర్ శంకర్ సినిమాతో ఆ కాంబినేషన్ వర్కవుట్ అవ్వనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ రూపొందించే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అయితే, హీరోయిన్ గా కియారా అంటూ అఫీషియల్ కన్ ఫర్మేషన్ లేదు. మరికొందర్నీ కూడా కన్ సిడర్ చేస్తున్నారట. కానీ, కియారా అద్వాణీ మాత్రమే ప్రస్తుతం ముందంజలో ఉంది..

payal rajput stunning put up on ladies durations!

balayya’s heroine Sonal Chauhan to play cameo in F3!