ఇషా రెబ్బా…తెలుగు అమ్మాయి…ఎనిమిదేళ్ళ క్రితం టాలీవుడ్ లో అరంగేట్రం ఇచ్చింది. ఆరంభంలోనే ‘అంతకు ముందు ఆ తర్వాత’ వంటి హిట్ అందుకుంది. ఆ తర్వాత తప్పుడు నిర్ణయాలవల్లో ఏమో అనుకున్న స్థాయికి ఎదగలేక పోయింది. మధ్యలో అమీతుమీ పర్వాలేదనిపించినా హీరోయిన్ గా సరైన గుర్తింపు రాలేదు. చేతికందిన సినిమాలు చేస్తూ వచ్చింది. ఆఖరికి స్టార్ హీరో, డైరక్టర్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత’లో తూతూ పాత్రకు కూడా సై అనేసింది. అయినా ప్రయోజనం లేక పోయింది.
తాజాగా ‘పిట్టకథలు’తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అందులో అమ్మడు నటించిన ఎపిసోడ్ అన్నింటిలో వరెస్ట్ అయి తేల్చేశారు నెటిజన్స్. రాబోయే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’లో సైడ్ క్యారక్టర్ తో సర్దుకుపోతోంది. ఇది కాక తమిళంలో ‘ఆయిరమ్ జన్మంగళ్’లో నటిస్తోంది. అది ఎలాంటి పాత్రో క్లారిటీ లేదు. తెలుగులో కొత్త కమిట్ మెంట్స్ ఏమీ లేవు. ఇప్పటికే 30 ప్లస్ ముద్ర పడిపోయింది. హీరోయిన్ అవకాశాలు రావటం చాలా కష్టంతో కూడిన పనే. వచ్చినా అరకొర అవకాశాల్లో కూడా సరైన గుర్తింపు వచ్చేవి శూన్యం. సో మరో తెలుగు అమ్మాయి కూడా తట్టా, బుట్టా సర్దేసినట్లే?