in

parineeti chopra about superstar mahesh babu!

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో పరిణీతిచోప్రా ఒకరు. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలో సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైనా’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రీ లుక్ ఇటీవలే విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఈ బాబ్లీ బ్యూటీ.  అలాగే హిందీలో మరో సినిమాలో నటిస్తుంది.

‘ది గర్ల్ బిహైండ్ ఆన్ ది ట్రైన్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ పై ఆసక్తికర కామెంట్లు చేసింది ఈ చిన్నది. టాలీవుడ్ లో మహేష్ అంటే చాలా ఇష్టమని, అతని అందం , ఆయన లుక్స్ అంటే చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ సినిమాలో అవకాశం వస్తే అస్సలు వదులుకొనని చెప్పుకొచ్చింది. అలాగే ఒక వేళ తెలుగులో సినిమా చేయాల్సి వస్తే ఒక్క మహేష్ బాబు సినిమాలోనే చేస్తానని.. మరే హీరో సినిమాలో చేయనని తెలిపింది ఈ బాలీవుడ్ భామ. మరి ఫ్యూచర్ లో ఈ అమ్మడికి మహేష్ తో నటించే అవకాశం వస్తుందేమో చూడాలి.

bad luck continues for telugu girl eesha rebba!

Ariyana Glory plays a key role in Kalyan dev’s film!